వైద్య రంగంలో దేశానికి ఆదర్శం తెలంగాణ..

నవతెలంగాణ – ఎల్లారెడ్డి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులకు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణ పరిశీలించి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని వైద్యులకు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వ లు రోగుల పట్ల ఇంత శ్రద్ధ తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం మరియు ప్రసవాల సంఖ్య కూడా పెరిగిందని ఆయన అన్నారు. దేశానికి వైద్య రంగంలో తెలంగాణ రోల్ మెడల్ గా నిలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు రాము, నీలకంఠం, నాయకులు నునుగొండ శ్రీనివాస్, తిరుపతి, పోచయ్య, శ్రవణ్, రాజు, అధిములం సతీష్, ఆసుపత్రి సూపర్ ఇండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.