దేశానికే తెలంగాణ ఆదర్శం

– మంత్రి హరీష్‌రావు
– బీఆర్‌ఎస్‌లోకి మహారాష్ట్ర నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సాగునీరు, తాగునీరు, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు, వ్యవ సాయం, పేదల సంక్షేమం కోసం చేపట్టిన కార్యాచరణ నేడు దేశా నికి ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అన్నా రు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తెలం గాణ మోడల్‌ పాలన అక్కడ కూడా అమలవుతుందని స్పష్టం చేశారు. హరీష్‌రావు సమ క్షంలో మహారాష్ట్రకు చెంది న పలువురు నాయకులు శుక్రవారం పార్టీలో చేరా రు. వారికి మంత్రి బీఆర్‌ ఎస్‌ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనతాపార్టీ లాతూర్‌ జిల్లా అధ్యక్షుడు జయ సింగ్‌ యాదవ్‌ బీఆర్‌ఎస్‌లో చేర డం ప్రాధాన్యత సంతరిం చుకున్నది. వీరితో పాటు ఆ జిల్లా సంఘటనకు చెందిన వోన్రాజ్‌ రాథోడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి అర్జున్‌ రాథోడ్‌, భగవంత్‌ కులకర్ణి తదితరులు పార్టీ లో చేరారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు జయంత్‌ దేశ్‌ ముఖ్‌ పాల్గొన్నారు.