– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
నవతెలంగాణ-తొగుట
తొమ్మిదిన్నర ఏండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ గా తీర్చిదిద్దడంలో చెరగని ముద్ర వేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. శనివారం విజయ దశిమిని పుర స్కరించుకొని తెలంగాణ తల్లి, బీఆర్ఏస్ పార్టీ జెండా గద్దెలను రంగులతో అలంకరించారు. విజయాలకు నిలయమైన విజయ దశిమి రోజున గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్యతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పిడికెడు మందితో తెలంగాణ కోసం పోరాటం మొదలు పెట్టి, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను స్వరాష్ట్రం కోసం జాగృతం చేసి తెలంగాణ సాధించి, దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో చెరగని ముద్ర వేసారని పేర్కొన్నారు.
తెలంగాణ వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ 1గా తీర్చిదిద్దారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి అధికారం లోకి వొచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు డోకా చేశారని ఆరోపించా రు. రాజకీయాలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఏమి కోల్పోయారో గ్రహిస్తున్నారని, భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ దే నన్నారు. ఈ సందర్బంగా మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పిట్ల వెంకటయ్య, బండారు స్వామి గౌడ్, సుతారి రాములు, మిద్దె శ్రీనివాస్, భీమరి నర్సింలు, జీడిపల్లి గోవర్ధన్ రెడ్డి, కొమురయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.