– కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్
– కడ్తాల్ మండలంలోని చెరువుల్లో చేప పిల్లలు వదలిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆమనగల్
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. కడ్తాల్ మండల పరిధిలోని గుర్లకుంట తాండా, గోవిందాయిపల్లి చెరువుల్లో మంగళవారం స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కడ్తాల్ మండలంలోని గుర్లకుంట తాండా, గోవిందాయిపల్లి చెరువుల్లో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కడ్తాల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న చెరువుల్లో కంటల్లో 6.5 లక్షల చేప పిల్లలు వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. అందులో కడ్తాల్ మండల కేంద్రంలోని చెరువుల్లో ఒక లక్ష చేప పిల్లలు వదలుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కడ్తాల్ మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, ఉపసర్పంచ్ రామకష్ణ, రైతు కోఆర్డినేటర్ నరసింహ, ఏఎంసీ డైరెక్టర్ లాయఖ్ అలి, మత్స్య శాఖ ఏడీ సుకీర్తి, మత్స్యకార సహకార సంఘం నేతలు యాదయ్య, బాలయ్య, వెంకటయ్య, సత్యనారాయణ, కష్ణయ్య, నరసింహ, ఎర్రోళ్ల రాఘవేందర్, వార్డు సభ్యులు, బిక్షపతి, మహేష్, నాయకులు రామచంద్రయ్య, ముత్తి కష్ణ తదితరులు పాల్గొన్నారు.