నవతెలంగాణ – కామారెడ్డి/ బీబీపేట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఇదో చరిత్రాత్మక ఘట్టమని ఈ కులగణ సర్వే దేశానికి ఆదర్శమని, దేశ భవిష్యత్ కోసం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమన్నారు. దేశంలో తొలిసారి తెలంగాణలో కులగణ చేసి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల జనాభా లెక్క తేలిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక అర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళిక రూపొందించేందుకు కులగణ సర్వేతో సాధ్యపడుతుందన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి కులగణ సర్వే ఎంతో ఉపయోగపడనుందన్నారు. బీసీ కులగణన అనంతరం అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు రాజకీయపరంగా మొదటి ప్రాధాన్యత కల్పించాలని అయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణ అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. దేశంలోనే బీసీ కులగణ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.