– ఐటీలో తెలంగాణ అసమాన వృద్ధి
– రైట్ సాఫ్ట్‌వేర్ న్యూడెవలప్‌మెంట్ సెంటర్
– ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారతీయ నగరాలతో పోలిస్తే తెలంగాణలో ఐటీ ఎగుమతులు, టెక్ ఉద్యోగాల్లో అసమాన వద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ ప్రతిభావంతులను ఆకర్షిస్తూ హైదరాబాద్ భారతదేశానికి వనరుల రాజధానిగా మారిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రైట్ సాఫ్ట్‌వే ర్ అత్యాధునిక డెవలప్‌మెంట్ సెంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభిం చారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ రైట్ సాఫ్ట్‌వేర్ కు ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన రైట్ సాఫ్ట్‌వేర్‌ను అభినందించారు. తెలంగాణలో, వరంగల్ నగరాల్లో ఐటీ వద్ధిని ప్రోత్సహించడానికి, ఉపాధి అవకాశాలను సష్టించేందుకు రైట్ సాఫ్ట్‌వేర్ నిబద్ధతతో ఉన్నందుకు ఆయన ప్రశంసించా రు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూ రి, రైట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు, సీఈవో కష్ణ బెండపూడి, ఇందు బెండ పూడి, సీఎఫ్‌వో, యూకే, యూరఫ్ ప్రెసిడెంట్ డాన్ కార్టర్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్
హైదరాబాద్‌లో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని ప్రముఖ ఆటోమేకర్‌లలో మొబిలిటీ ప్రొవైడర్ ఒకటిగా ఉందన్నారు. 30 కంటే ఎక్కువ దేశాలలో పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 130 కంటే ఎక్కువ మార్కెట్‌లలో కస్టమర్‌లతో స్టెల్లాంటిస్ ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కంపెనీ జీప్, సిట్రోయెన్, మసెరటి, ప్యుగోట్, ఫియట్ మొదలైన కొన్ని దిగ్గజ బ్రాండ్‌లతో ప్రపంచవ్యాప్త మొబిలిటీ లీడర్‌గా గుర్తింపు ఉంది. విప్రోతో బీఓటీ మోడల్ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సమగ్రమైన మొబిలిటీ ఎకో సిస్టం ఉందన్నారు.
న్యూ మొబిలిటీ కోసం…
మొబులిటీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి హైదరాబాద్ కేంద్రంగా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్వయం ప్రతిపత్తి, సురక్షితమైన, ఎలక్ట్రిక్ వాహనాలపై దష్టి సారించిన మొబీస్ ఇండియా, బిట్స్‌ఫిలానీ(హైదరాబాద్), తెలంగాణ ప్రభుత్వం మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు.