నవతెలంగాణ – భువనగిరి
పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు. సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.పద్మ అవార్డులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము చేసిన సిఫార్సులను లెక్కచేయకుండా అవార్డులను ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండడానికి చూస్తుంటే,రాష్ట్రంలో ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుర్తింపు లేనట్టుగా అనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు,ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయమన్నారు. గత పది సంవత్సరాలలో కెసిఆర్ పాలనలో ఉన్న వారికి వైర్యం ఉందేమో,ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇస్తున్న మా సిఫార్సులను పట్టించుకోకపోవడం తప్పు పట్టారు. బిజెపి వైకారిమార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. విభజన హామీలు, తెలంగాణ ప్రజలు కూడా టాక్సీలు కడుతున్నారు.దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన టాక్స్ లు కడుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఎనిమిది మంది బిజెపి ఎంపీలు, ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ల పైన ఉందన్నారు.