తాడ్వాయిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

– జాతీయ జెండా ఎగరవేసిన ఎంపీపీ వాణిశ్రీ
నవతెలంగాణ- తాడ్వాయి
మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ గొంది వాణిశ్రీ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ భారతదేశానికి అంతా 15 ఆగస్టు 1947 నా స్వాతంత్రం వచ్చిన, హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దారు తోట రవీందర్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, అధికారులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.