తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ- వీర్నపల్లి 
వీర్నపల్లి మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజేపి మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ బట్టు పీరయ్య, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు , మండల ప్రధాన కార్యదర్శి పోతారం నరేష్, బూత్ అధ్యక్షులు లింబాద్రి, బండారి మహేష్, సుమన్, సోషల్ మీడియా కన్వీనర్ బానోత్ శ్రీనివాస్, మాజి మండల అధ్యక్షులు మల్లేశం,నాయకులు వినోద్,కళ్యాణ్ రాజేందర్,సతీష్, కుమార్, ఎల్లయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు.