‘తెలంగాణ’ మాసపత్రిక ఆవిష్కరించిన సీఎం

'తెలంగాణ' మాసపత్రిక ఆవిష్కరించిన సీఎంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ మాసపత్రికను శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ అయోధ్యరెడ్డి, మాసపత్రిక ఎడిటర్‌ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన ప్రముఖులు
ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులు కలిశారు. వారిలో గవర్నర్‌ కోటాలో నూతనంగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ ఎమ్‌ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి, సినీ నటుడు వెంకటేశ్‌, సినీ నిర్మాత సురేష్‌ బాబు తదితరులు ఉన్నారు.