దొడ్డి కొమురయ్య స్పూర్తితో తెలంగాణ ఉద్యమం

– కొడారి వెంకటేష్, సామాజిక కార్యకర్త
నవతెలంగాణ  – భువనగిరి
భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. బుధవారం భువనగిరి అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద నిర్వహించిన దొడ్డి కొమురయ్య 97 వ జయంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబు ఏర్పాటు చేసుకున్న రాజాకార్ ప్రైవేటు సైన్యం, దొరలు, జామీందారుల ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత రైతాంగ పోరాట ఉద్యమంలో దొడ్డి కొమురయ్య పై రజాకార్లు కాల్పులు జరిపి ఆయన  ప్రాణాలు బలిగొన్నారని ఆయన తెలిపారు. ఆ తరువాత  తెలంగాణలో గుప్తల సంఘం, సాయుధ పోరాట సంఘాలు ఏర్పడి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి రజాకార్ల నుండి విముక్తి కల్గించారని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం  శాంతియుతంగా జరుగుతున్న సమయంలో కాసోజు శ్రీకాంత్ చారి మరణంతో తీవ్ర రూపం దాల్చిందని ఆయన అన్నారు. తొలి అమరుల స్పూర్తితో  ప్రజలు పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  సాధించుకున్నారని  ఆయన అన్నారు. నేటి యువత తొలి అమరులైన దొడ్డి కొమురయ్య, కాసోజు శ్రీకాంత్ చారిల జీవిత చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి, భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్, గుండె బోయిన వీరేష్ యాదవ్, పర్వతం కృష్ణ యాదవ్, నక్కల చిరంజీవి  ,రాసాల రణధీర్ యాదవ్,  పాల్గొన్నారు.