ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

నవతెలంగాణ -పెద్దవంగర: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అధికారికంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..సెప్టెంబర్‌ 17 సువిశాల భారత్‌లో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు అని, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని పేర్కొన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్‌ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం అందరికీ గుర్తుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరి రావు, కనుకుంట్ల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, మండల నాయకులు శ్రీరాం సుదీర్, సర్పంచ్ ధరావత్ భీమా, ఎంపీటీసీ సభ్యులు ఎర్ర సబితా, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, నీలం సోమయ్య, రెడ్డబోయిన గంగాధర్, కుకట్ల వీరన్న, భూక్యా దస్రు నాయక్, ఆరుట్ల వెంకట్ రెడ్డి, బానోత్ శ్రీనివాస్, గ్రామ రైతు కోఆర్డినేటర్లు ఈరెంటి శ్రీనివాస్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, మండల రైతు సెల్ ప్రధాన కార్యదర్శి బానోత్ గోపాల్, ఎండీ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.