
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాహసిల్దార్ అల్లం రాజకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పతాక వందనం స్వీకరించారు. అనంతరం తాహసిల్దార్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. రజాకార్ల నుండి నేటి వరకు తెలంగాణ పోరాట చరిత్రను వల్లే వేశారు. నేటి తెలంగాణను చక్కదిద్దుకోవలసిన బాధ్యత పౌరులందరికీ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పటు పసర పోలీస్ స్టేషన్ పోలీసులు స్థానిక పౌరులు పాల్గొన్నారు.