– ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసిన కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎక్స్ లో ఆసక్తికర వీడియోను ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవిత శనివారం పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన సన్నివేశాలను వీడియోలో చిత్రీకరించారు.”ధాన్యపు రాశుల తెలంగాణ… అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అని ట్యాగ్ లైన్ పెట్టి పోస్ట్ చేశారు. నెట్టింట్లో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.