నవ తెలంగాణ – ఊట్కూర్
హిందూ, ముస్లింలు ఐక్యంగా సాధించిన సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ మక్తల్ డివిజన్ కార్యదర్శి సలీం అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రాముఖ్యతను వివరిస్తూ సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు సభలో సమావేశాలు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ పార్టీ పిలుపులో భాగంగా ఆదివారం మండలంలోని బిజ్వార్ గ్రామంలో శ్రామిక భవన్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మక్తల్ డివిజన్ కార్యదర్శి, మండల కార్యదర్శి కొత్తపల్లి రామాంజనేయులు అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ కోటి చెన్నప్పలు మాట్లాడుతూ1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గెరిల్లా యోధులతో కమ్యూనిస్టుల వీరుల రక్తంతో తెలంగాణ నేల పులకించి పరవళ్లు తొక్కిందన్నారు. పది లక్షల ఎకరాలు భూమిని పంచి పెట్టి వెట్టిచాకిరీని రద్దు చేసిందని పేర్కొన్నారు. కౌలు రైతుల హక్కులు కల్పించిందని, 3000 గ్రామాలను బానిసత్వం నుంచి విముక్తి చేసిందన్నారు. భూమిని పంచి గ్రామాలలో భూస్వామ్య దురాంకారపు కోరలు విరిచి స్వేచ్ఛ అందిం చిందన్నారు. ఈ పోరాటం నిజాం రజాకారులను పోలీసు దౌర్జన్యాన్ని నెహ్రూ పటేల్ మిలిటరీ నరహంతకత్వాన్ని ఎదుర్కొన్నదని అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూమికోసం విముక్తి కోసం పోరాడి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విసునూరు దేశముఖ్ కాల్పుల్లో అమరుడయ్యారని, భూమి కోసం పోరాడి ఐలమ్మ కొడవలి పట్టి నిజాం రజాకార్లను ఎదిరించిందన్నారు. 4000 మంది పటేల్ సైన్యం ఊచ కోత కోసిందన్నారు. భూస్వామ్యం నిజం రాచరికంపై విరోచిత విజయాలను సాధించుకున్న తెలంగాణ పోరాటాన్ని ముందు నడుపుతున్న కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. నిజాం రాజు నెహ్రూ పటేల్ మధ్య జరిగిన రాజి ఒప్పందం సెప్టెంబర్ 17న పటేల్ సైన్యాలు తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. భూస్వాముల ,జమీందారుల భూములను తిరిగి జమిందార్లకు అప్పగించారని, తెలంగాణ సాయిధ రైతాంగ విముక్తి పోరాటాన్ని అణిచివేశారన్నారు. అందుకే సెప్టెంబర్ 17 విద్రోహమే అన్నారు. చరిత్ర ను వక్రీకరించడం తగదన్నారు. హిందూ ,ముస్లింలు ఐక్యంగా సాగించిన సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. ఈ సమావేశంలో డివిజన్ నాయకులు కష్ణయ్య ,వై రాజు చిన్న బాలు ,సీ. అంజప్ప, కొల్లంపల్లి మల్లేష్, వై. నరసింహులు, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు చంద్రములు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ – 17 ముమ్మాటికీ విద్రోహమే..
నవతెలంగాణ – మక్తల్
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ అధ్యర్యంలో సెప్టెంబర్ – 17ను తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం , జిల్లా నాయకులు ఎస్.కిరణ్ అన్నారు. ఆదివారం మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ డివిజన్ నాయకులు అధ్యక్షత వహించగా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం , జిల్లా నాయకులు ఎస్. కిరణ్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ -17న తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు రైతులు కుల ,మతాలకు అతీతంగా భూమి, భుక్తి, వేట్టిచాకిరీ విముర్తి కోసం భుస్వాములు, రజాకార్ నిజం పోలీస్‌ల దౌర్జ న్యాలకి వేతిరేకంగా కమ్యునిస్టుల ఆధ్వర్యంలో వందలాది గ్రామాల ప్రజలను చైతన్యపరిచి అనేక పొరాటాలు చేశారన్నారు. దున్నే వానిదే భుమి అనే నినాదంతో భుస్వాముల ఆదినంలో ఉన్న 10 లక్షల ఎకరాల భుమిని కుల, మతాలకు అతీతంగా రైతులకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. ఈ రోజును విమొచన ఒకరూ.. విముక్తి అని ఒకరూ పేర్కొంటున్నారన్నారు. పటేల్ సైన్యం హైద్రాబద్ వచ్చి కాపాడింది నిజాంను, భుస్వాములను అని, కాని తెలంగాణ ప్రజలను కాదన్నారు. పటేల్ సైన్యం హైద్రాబాద్ వచ్చి నిజంను జైల్లో వేయలేదని, గౌరమర్యాదలు చేసి 1948 నుంచి 1952వరకు హైద్రాబాద్ గౌవర్నగా నియ మించారని పేర్కొన్నారు. నిజాం పటేల్ సైన్యం సహకారంతో తెలంగాణ పేదలు, రైతులు, కమ్యూనిస్టులను చిత్రహింసలకు గురిచేసి 2500 మందిని చంపి పదిలక్షల ఎకరాల భుమిని తిరిగి భుస్వాములకు అప్పజేప్పారని అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు విద్రోహాం, నిజం, భుస్వాములకు విమొచన జరిగిందని సెప్టెంబర్ 17ను విమోచన కాదు, విలీనం కాదు ముమ్మాటికి సెప్టెంబర్ 17 విద్రోహ దినంగా జరుపాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎ జి భుట్టో, నాయకులు మహిముద్, రాజు, ఆంజనేయులు, పంచదేవ్ పాడు రాజు , వెంకటేష్, మల్లేష్, మారెప్ప, లోకేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అజరు తదితరులు పాల్గొన్నారు.