తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శం : మంత్రి సత్యవతి

నవతెలంగాణ-మహబూబాబాద్‌
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ”సురక్ష దినోత్సవ వేడుకలలో” భాగంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌లో ఉదయం పెట్రోలింగ్‌ కార్లు, బ్లూ కోర్స్‌ వాహనాలు, అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీని మంత్రి సత్యవతి రాథోడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఐటి కోర్‌ అండ్‌ సైబర్‌ సెల్‌ను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పారదర్శక పాలనలో పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారు అన్నారగడిచిన 9 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ఫ్రెండ్లీ పోలీసుతో పాటు పోలీసు శాఖలలో అనేక సంస్కరణలు చేప ట్టింది అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తుంది అన్నారు. మహిళలకు షీటీమ్స్‌తో భద్రత కల్పిస్తున్నారు అన్నారుసీఎం కేసీఆర్‌ పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తు న్నారని, పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని త్వరగా కేసులు ఛేదిస్తు నాడు అన్నారు పోలీస్‌ శాఖకు 2013-14లో 6వేల మంది సి బ్బంది ఉండగా, ప్రస్తుతం 9,600 సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరుగు తుంది అన్నారు. హౌంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దక్కుతుందన్నారు. నేడు సురక్షా వేడుకల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కషిని, స్నేహపూర్వక విదానాలను ప్రజ లకు వివరించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటు జడ్పీ చైర్పర్సన్‌ కుమారి అంగోత్‌ బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్‌ రావు, శాసనసభ్యులు బానోత్‌ శంకర్‌ నా యక్‌, ఎంపీ మాలోత్‌ కవిత, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ పాల్గొన్నారు.