నేడు పొలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమం

నవతెలంగాణ – ఎల్లారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో జూన్ 12 సోమవారం ఉదయం 6 . 00 గంటలకు పోలీస్ శాఖ నేతృత్వంలో తెలంగాణ రన్ కార్యక్రమం ఎల్లారెడ్డి లోని అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ లు తెలిపారు. ఇట్టి తెలంగాణ రన్ కార్యక్రమానికి గౌరవ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా మరియు నియోజకవర్గ ముఖ్య ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు అని కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల యువకులు, విద్యార్థులు, అన్ని శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి తెలంగాణ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు…