తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లను దేశవ్యాప్తంగా అమలు చేయాలనీ, ఉచిత విద్య, వైద్యం అందజేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ బొమ్మర బోయిన కేశవులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల పేదలకే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా అందుతున్నాయన్నా రు. 70 ఏండ్లు అధికారంలో ఉన్న వాళ్ళు, ఉచిత విద్యుత్‌ అడిగితే కాల్చి చంపినోళ్ళు ఈరోజు ఏదో చేస్తాం అంటు న్నారన్నారు. ఇన్నేండ్లు ఏం చేశారో చెప్పాలన్నారు. దేశంలో పేదరికం పోవాలంటే, యువత బాగుపడాలి అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న సంక్షే మ పథకాలను కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. మిగతా రాష్ట్రాలు ఎందు కు పేదరికంలోనే ఉన్నాయి అని ప్రశ్నించారు. సంచార హక్కు చట్టం కొందరు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం వాడుకుంటున్నారన్నారు. రాజకీయ నాయ కులు ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో దానిపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బొమ్మర బోయిన కేశవులు మాట్లాడు తూ సామాన్య ప్రజలకు వారి సంపదలో ఎక్కువ భాగం విద్య, వైద్యంకు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. దీనితో ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, సమయానికి కావాల్సిన వైద్యం, అవసరమైన విద్యను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా సమాచార హక్కు పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమా చార కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ జి.యతిరాజులు, జల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ, ఎస్‌హెచ్‌ పీఎస్‌ జాతీయ కో-ఆర్డినేటర్‌ గాదం ఉత్తరయ్య, సమా చార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ కన్నబోయిన ఉషారాణి, సమాచార హక్కు పరిరక్షణ సమితి హైదరాబాద్‌ జిల్లా కన్వీనర్‌ కొంసంపేట శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.