తెలంగాణ ఆత్మగౌరవ సంబరం “బతుకమ్మ”

– ఎస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

నవతెలంగాణ-పెన్ పహాడ్
తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ సంబరం “బతుకమ్మ” పండుగ అని ఎస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి మంగళవారం విచ్చేసిన ఆమె గ్రామ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, ఎంపీటీసీ మామిడి రేవతి పరంధాములు, సర్పంచ్ భార్య బైరెడ్డి జయమ్మ లతో కలిసి పూలతో బతుకమ్మలను పేర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మలను పేర్చుతు మహిళలు తమ బాగోగులు తెలుసుకుంటారని, మహిళలను ఒక దగ్గరికి చేసే పండుగ బతుకమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కోటమ్మ, బోడ బుజ్జమ్మ, దంతాల వాణి, గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.