- ఫిజికల్ డైరెక్టర్ సిహెచ్ ఐలయ్య
నవతెలంగాణ నెల్లికుదురు: మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ పాఠశాల క్రీడ ప్రాంగణంలో నెల్లికుదురు డి వై ఎస్ ఓ, ఎంఈఓ రాము ఆధ్వర్యంలో క్రీడా పాఠశాల ఎంపికలు నిర్వహించామని ఫిజికల్ డైరెక్టర్ సిహెచ్ ఐలయ్య సోమవారం తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎంఈఓ రాము పాల్గొని మాట్లాడుతూ ఈ ఎంపికలలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొనగా 40 మందిని 20 బాలురు 20 బాలికలు ఎంపికైనారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 29న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నందు జిల్లా ఎంపికలలో పాల్గొంటారు. ఇట్టి కార్యక్రమానికి సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ జి సత్యనారాయణ మరియు ఫిజికల్ డైరెక్టర్లు ఎండి ఇమామ్ ఎస్ ప్రవీణ్ ఓ కొమురయ్య పాల్గొన్నారు