తెలంగాణ స్టేట్‌ అడ్వకేట్‌ జేఏసీ ఉపాధ్యక్షునిగా

తెలంగాణ స్టేట్‌ అడ్వకేట్‌ జేఏసీ ఉపాధ్యక్షునిగా– గుంజి సంతోష్‌ కుమార్‌ వడ్డేరాజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ అడ్వకేట్‌ జేఏసీ ఉపాధ్యక్షునిగా సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లికి చెందిన గుంజి సంతోష్‌ కుమార్‌ వడ్డేరాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్‌.శ్రీనివాస్‌ సంతోష్‌ కుమార్‌ కు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ 41 సీఆర్పీసీ, స్టేషన్‌ బెయిల్‌ రద్దు, జూనియర్‌ న్యాయవాదులకు తొలి ఐదేండ్లు రూ.10 వేల ఉపకారవేతనం, పేద న్యాయవాదులకు సొంత ఇంటి స్థలాలు మంజూరు వంటి సమస్యలున్నాయని తెలిపారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ, న్యాయ శాస్త్ర విద్యార్థులు, యువ న్యాయవాదుల హక్కుల కోసం పోరాడుతున్న సంతోష్‌ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరమని భావించి ఈ పదవిలో నియమించినట్టు తెలిపారు.