వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల రిటైర్డ్ కమిషనర్ పార్థసారథి

నవతెలంగాణ -తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవతలను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల రిటైర్డ్ కమిషనర్ సి పార్థసారథి స కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. అనంతరం పూజారిలో ఎండమ్ ఉంటది కార్లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి వనదేవతల ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీజ స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, పూజారులు సిద్ధబోయిన అరుణ్, కొక్కెర పూర్ణచందర్ రానా రమేష్ మునేందర్ కొక్కెర రమేష్, ఎండోమెంట్ సిబ్బంది జ్ఞానేశ్వర్, మధు ఆర్ ఐ సునీల్ ప్రోటోకాల్ అధికారి బొప్ప సమ్మయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.