తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని బోర్గం (పి) సొసైటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇన్ డిసిసి బ్యాంక్ మరియు క్రిబ్కో డైరెక్టర్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టo ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చిందని కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కర్షకులకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుందని ఆగస్టు 15 లోపల కచ్చితంగా ముఖ్యమంత్రి ఏమంటే రెడ్డి  కర్షకులకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుందని ఆగస్టు 15 లోపల కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ చేసి తీరుతారని అలాగే వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం వల్ల సొసైటీలకు కూడా మహాదశ వస్తుందని రానున్న రోజుల్లో సొసైటీలు అత్యధిక లాభాల్లోకి పయనిస్తాయని దీనికి కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన ఆశాభావ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జయకృష్ణ డైరెక్టర్లు సాయి రెడ్డి, మహేందర్ రెడ్డి, మోహన్, నారాయణ, నరేష్, చమకుర రాజశేఖర్ రెడ్డి, బూ జేందర్ రెడ్డి లక్ష్మీ, శోభ, సీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.