తెలంగాణ రాష్ట్ర హాండ్ బాల్ అసో సియేషన్ సర్వసభ్య సమావేశం ఎన్నికలు తేది 11-08-2024 ఆదివారం రోజున ఢిల్లీ పబ్లిక్ పాఠశాల నాచారం, హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించారని హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్ తెలిపారు. ఈ సమావేశం గొనె శ్యాంప్రసాద్ రావు అద్యక్షతన సమావేశమై తెలంగాణ రాష్ట్ర హాండ్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని 2024 2028 సంవత్సరాలకు ఎన్నుకోవడం జరిగిందన్నారు.
ఈ ఎన్నికలకు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రీత్ పాల్ సింగ్ సలూజ, తెలంగాణ క్రీడా ప్రాదికారిక సంస్థ పరిశీలకులుగా శ్రీకాంత్ తెలంగాణ బలంపిక్ సంఘం పరిశీలకులుగా రవీందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ ఎన్నికలకు ఎన్నికలరిటర్నింగ్ అధికారిగా శ్యాం వ్యవహరించారు.ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సీఈవో, అద్యక్షులుగా యశస్వి మల్క,
ప్రధాన కార్యదర్శిగా శ్యామల పవన్ కుమార్, కోశాధికారిగా సంజీల్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా గోనె శ్యాంసుందర్ రావు , రఫీయుద్దవ్ , శ్రీకాన్త్ , పింజా సురేందర్, సంయుక్త కార్యదర్శులుగా, రమేష్, లక్ష్మణ్ పుల్లయ్య, తిరుమల్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ హ్యాండ్ బాల్ సంఘం ఉపాధ్యక్షులుగా నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నిక పట్లజిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షులు గంగా మోహన్ చక్రు,జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి,హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి రమణ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. గంగాధర్,జక్క రాజేశ్వర్,ఎం రాజేందర్,బి నాగేష్,నరేంద్ర చారి, కే నాగేష్, పి. నరేందర్, సురేష్,భూపతి, సంతోష్, ఠాగూర్,చిన్నయ్య, మధు,సడక్ నాగేష్,తదితరులు అభినందించారు.