కేసీఆర్ హాయంలో తెలంగాణ రాష్ట్ర ఎంతో అభివృద్ధి చెందింది 

– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి 
నవతెలంగాణ నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హాయంలో తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెంది రాష్ట్రంగా ఏర్పాటు అయిందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పరు పాటిప వెంకటరెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావ్ జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు నల్లని నవీన్ రావు రైతు సమన్వయ సమితి మాజీ చైర్మన్ బాలాజీ నాయక్ అన్నారు మండలంలోని నైనాల నల్లగుట్ట తండా నర్సింహులగడెం ముప్పారం గ్రామాలలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని గురువారం పర్యటింబీచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గతంలో ఎమ్మెల్యేగా మరియు ఇప్పుడు ఎంపీగా గెలిచి మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో పేద ప్రజలకు ఎంతో సేవ చేసిందని అన్నారు కోట్లాది నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కవిత ది అని అన్నారు అందుకోసం మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా  కవిత కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కాసం వెంకటేశ్వర రెడ్డి రమేష్ ఉపేందర్ ఆ పార్టీ మీద గ్రామ శాఖ మండల నాయకులు పాల్గొన్నారు