ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

జిల్లా పోలిస్‌ కార్యాలయంలో
నవ తెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను, పుర స్కరించుకొని జిల్లా పోలిస్‌ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ జె సురేందర్‌ రెడ్డి జాతీయ జండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలిస్‌ అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలి పారు. శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవు తుందన్నారు. సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలకు భరోసా కల్పిస్తూ స్నేహపూర్వక పోలీసింగ్‌ తో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలం దరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు. పోలిస్‌ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో పాటు, వీధుల పట్ల అంకిత భావంతో, మరింత బాధ్య తతో పని చేసి జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిచి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. అదనపు ఎస్పి (అడ్మిన్‌) వి. శ్రీనివాసులు, అదనపు ఎస్పీ (ఏఆర్‌) వి శ్రీనివాస్‌, భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, డిఎస్పి కిషోర్‌కుమార్‌, ఏఓ ఆయూబ్‌ఖాన్‌, సీఐలు, ఎస్సైలు, డిపిఓ సిబ్బంది, పోలిస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్‌ కార్యాలయంలో….
జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాల యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. భూపాలపల్లి మున్సిపల్‌ చైర్పర్సన్‌ సెగ్గం వెంకటరాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. వైస్‌ చైర్‌ పర్సన్‌ కొత్త హరిబాబు, గ ఫ్లోర్‌ లిడర్‌ గండ్ర హరీష్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిష్నర్‌ అనిల్‌ కుమార్‌, కౌన్సిలర్లు నూనె రాజు ,ఆకుదారి మమత రాజమల్లు ,మంగలపెల్లి తిరుపతి, సజ్జెనపు స్వామి ,పానుగంటి హారికశ్రీనివాస్‌ ,ముంజంపల్లి మురళీధర్‌ ,మేకల రజితమల్లేష్‌ ,ఎడ్ల మౌనికశ్రీనివాస్‌ ,బద్ది సమ్మయ్య ,కో అప్సన్‌ మెంబర్స్‌ దొంగల ఐలయ్య , నెరవేట్ల కమల,ఏఈ రాజారాణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి ఆధ్వర్యంలో…
నవతెలంగాణ- కోల్‌ బెల్ట్‌
జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సింగరేణి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిఎం బళ్ళారి శ్రీనివాసరావు హాజురై మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి, అమర వీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం జిఎం శ్రీని వాసరావు పచ్చ జెండా ఊపి తెలంగాణ రన్‌ను ప్రారంభించారు. రన్‌ కొనసాగింపుగా అంబేద్కర్‌, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సింగరేణి ఉద్యోగులు, కళాకారులతో ధూం..ధాం, నృత్యాలతో జీఎం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జియం జాతీయ పతాకావిష్కరణ గావించారు. సంస్థ సీఎండి ఎన్‌. శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఈనెల 5న నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఎస్‌ఓటు జిఎం వెంకటయ్య, ఏజీఎంలు రామలింగం, జ్యోతి, ఏజెంట్లు ఎన్వి రావు, వెంకట్రాంరెడ్డి, డీజీఎం(క్వాలిటీ) కవీంద్ర, ఏఎస్‌ఓ జిఎల్‌ ప్రసాద్‌, ఏరియా అధికార ప్రతినిధి తుకారం, ఫైనాన్స్‌ మేనేజర్‌ సురేఖ, ఐటి మేనేజర్‌ రజిని, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, యూనియన్‌ నాయకులు బడితల సమ్మయ్య టీబిజీకేఎస్‌, మోట పలుకుల రమేష్‌ ఏఐటీయూసీ, తోగరి శ్రీనివాస్‌ సిఐటియు, లక్ష్మణ్‌ బిఎంఎస్‌, కమ్యూనికేషన్‌ సెల్‌ విభాగ అధికారి శ్యాం ప్రసాద్‌, ఎంవిటిసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలవ్యాప్తంగా…
నవతెలంగాణ- తాడ్వాయి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని గ్రామ పంచాయతీలలో, పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచిందన్నారు. నేటి నుండి 22వ తారీకు వరకు 21 రోజులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. తహసిల్దార్‌ ముల్కనూరు శ్రీనివాస్‌, మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్‌, కో ఆప్షన్‌ నెంబర్‌ దిలావర్‌ ఖాన్‌, వివిధ శాఖల ఉద్యోగులు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం దేవస్థానం ప్రాంగణంలో….
నవతెలంగాణ-మహాదేవపూర్‌
మండలంలోని కాళేశ్వరం దేవస్థానం ఆవరణలో రాష్ట్ర అవిర్భవా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ జెండాను కాళేశ్వరం దేవబ స్థానం చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అభివృద్ధికి నోచుకోని దేవాల యాలను అభివృద్ధి చేస్తూ కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేటాయిం చారని అన్నారు. రూ.25 కోట్లతో దేవస్థానంకు అభివృద్ధి చేపించిన పుట్ట మధుకర్‌, బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అర్చకులకు గౌరవ వేతనం ఇస్తు వారి అభ్యున్నతికి కృషి చేసిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. ఆలయ ఈఓ మహేష్‌, గ్రామ సర్పంచ్‌ వెన్నపురెడ్డి వసంత మోహన్‌ రెడ్డి, ఎంపీటీసీ రేవెల్లీ మమత నాగరాజు, డైరెక్టర్లు కలికోట దేవేందర్‌, కుంభం పద్మ, బి ఆర్‌ ఎస్‌ పార్టీ మండల యూత్‌ అధ్యక్షులు ఆలిమ్‌ ఖాన్‌, అర్చకులు నాగేష్‌ శర్మ , సీనియర్‌ నాయకులు వెన్నపురెడ్డి మోహన్‌ రెడ్డి, రేవెల్లీ నాగరాజు దేవస్థానం సిబ్బంది, నాయకులు ఉన్నారు.