ప్రజా పాలనలో తెలంగాణ యూనివర్సిటీ కీ అన్యాయం.. 

– బడ్జెట్ పత్రాలు దగ్ధం ఎస్ఎఫ్ఐ..
– టీయూ కు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి 200 కోట్ల నిధులను తీసుకురావాలి..
నవతెలంగాణ-డిచ్ పల్లి : ప్రజా పాలనలో తెలంగాణ యూనివర్సిటీ కీ అన్యాయం జరిగిందని, విద్యా కు, యూనివర్సిటీ కి నీదూల కేటాయింపులో అన్యాయం జరిగిందని, బడ్జెట్ కు సంబంధించిన పత్రాలను  ఎస్ ఎఫ్ ఐ అద్వర్యంలో దగ్దం చేశారు.టీయూ కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి 200 కోట్ల నిధులను తీసుకురావాలి డిమాండ్ చేశారు.శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో  తెలంగాణ యూనివర్సిటీ బస్టాండ్ ఆవరణలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3% ఇది గత ఓటాన్ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ.గత బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. అది ప్రస్తుతం 21,292కోట్లు కేటాయించారు.  అందులో యూనివర్శిటీల అభివృద్ధి  500 కోట్లతో ఎలా అభివృద్ధి చెందుతాయని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ యూనివర్సిటీ కీ నామమాత్రపు నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఎంఎల్ఏ  భూపతి రెడ్డి  కలగచేసుకొని తెలంగాణ యూనివర్సిటీ కి 200 ల కోట్ల నిధులను తీసుకురావాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు చిత్ర్రు, మధు,రఘు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.