
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన దుండగుల మల్లవ్వకు, తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గురువారం పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మల్లవ్వ గత నెల వట్టెంల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి ప్రమాదవశాత్తు క్రేన్ తో సహా బావిలో పడి దుర్మరణం చెందారు. ఆ విషయం తెలుసుకున్న తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి తెలుసుకొని సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి శివరాత్రి అయిలయ్య, జిల్లా నాయకులు సుర దాసు,శివరాత్రి కుమార్, వేములవాడ టౌన్ అధ్యక్షులు శివరాత్రి దేవయ్య, అర్బన్ మండల అధ్యక్షుడుసూర రాము, టౌన్ ఉపాధ్యక్షులుదండుగుల ఉప్పలయ్య, శివరాత్రి కనకరాజు, శివరాత్రి రమేష్, శివరాత్రి రాకేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.