ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ విమెాచన దినోత్సొవం

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో ఎంపిపి సుర్నార్ యశోదా చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేసి  తెలంగాణ విమోచన దినోత్సవం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఘణంగా ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపిపి ఎస్. యశోదా మాట్లాడుతు నిజాం పరిపాలన నుండి విముక్తి పొందిన తెలంగాణగా విమేాచనం జర్గిందని, నాటి నుండి తెలంగాణ ప్రజలకు స్వేచ్చ కల్గిందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి.రాములు, మాజీ ఎంపిపి శట్కార్ బస్వంత్ రావ్, మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు నీలుపటేల్, విజయ్ పటేల్, విండో డైరెక్టర్లు తదితరులు పాల్గోన్నారు. అదేవిధంగా మండలంలోని ప్రభూత్వ కార్యాలయాల పైన,   జీపీలలో  జాతీయ జెండాలను ఎగురవేసారు.