సోనియా గాంధీ చలువతోనే తెలంగాణ ఏర్పాటు..

Formation of Telangana with the influence of Sonia Gandhi..– కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రత్యేక తెలంగాణ పోరాటాల నేపధ్యంలో పార్లమెంట్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్లనే తెలంగాణ సాకారం అయిందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు పేర్కొన్నారు. ముందుగా సోనియా గాంధి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్త్ డే కేక్ కట్ చేసి హర్షధ్వానాలు నడుమ ఆమె కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్క్రుతి సాంప్రదాయ శ్రామిక మహిళ కు నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్,గార్లపాటి రాములు,కావూరి మోహాన్ రావు తదితరులు పాల్గొన్నారు.