త్యాగాలతోనే తెలంగాణ

– తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం -ఉద్యమ కారుల వేదిక తెలిపింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజాత్యాగాలతోనే తెలంగాణ’ అనే అంశంపై ఎల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలి మలి దశ ఉద్యమకారులు పాల్గొన్నారు.తెలంగాణ తెచ్చింది తామే అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రజల త్యాగాలను వారు అవమానిస్తున్నారని విమర్శిం చారు.ఈ కార్యక్ర మంలో న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్‌,కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ, మాజీ మంత్రి విజయరామారావు, సుధాకర్‌ పాల్గొన్నారు.