-ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం
-రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు అప్పులు పెరిగాయని కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు భారీగా పెరిగాయని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలేదని అంతలోనే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని స్వేద పత్రంతో విమర్శ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై స్వేద పత్రాలు కాదు కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు ఎలా పెరిగాయో, ఫామ్ హౌస్ , ఇండ్ల విలువ వందల కోట్ల ఎలా వచ్చాయో సౌద పత్రాలు విడుదల చేయాలన్నారు. 20 రోజుల్లో రెండు హామీలను నెరవేర్చమని అన్నారు. ప్రజాపాలనలో సమస్యపై దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు రసీదు తీసుకోవాలన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచమన్నారు .మహిళలు నాలుగు కోట్ల మంది జీరో టికెట్ ప్రయాణం చేశారన్నారు. మహిళలలు ఊహించిన విధంగా ఉచిత ప్రయాణం పై అనూహ్య ఆస్పందన వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాన 48 గంటల్లోనే ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. కొన్ని రూటులలో బస్సులు కావాలని నా దృష్టికి వచ్చిందని త్వరలోనే సమస్యలు లేకుండా చూస్తామన్నారు. కొత్త బస్సులు తీసుకొస్తాం అన్ని రూట్లో బస్సులు వేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ పరిస్థితి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీ నుండి 5వ తేదీ వరకు తీసుకునే రోజులు వస్తున్నాయన్నారు. ప్రజా పాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు. స్వేచ్ఛ ఇస్తున్నామని మీకు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, చిత్తారి పద్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.