తెలంగాణ మరో గాంధీ మాజీ సీఎం కేసీఆర్..

Telangana's another former Gandhi CM KCR..– నవంబర్ 29న దీక్ష దివాస్ స్ఫూర్తిని ప్రజల్లో రగల్చాలి..
– జిల్లా ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
2001 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల వరకు శాంతియుత పద్ధతిలో సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మరో గాంధీ అని దీక్ష దివాస్ ఇన్చార్జి  పోచంపల్లి  శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జగదీష్ రెడ్డి లు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బి.ఆర్.ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు ముఖ్య అతిథులు హాజరై,  మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 29న దీక్ష దివాసును 2009 న  ప్రారంభించి, శాంతియుత పద్ధతిలో నిరసన చేపటగా ఖమ్మంలో అరెస్టు చేయడంతో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేయడంతో డిసెంబర్ 9న అప్పటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారని అన్నారు. తెలంగాణ సాధించిన మరో గాంధీ మాజీ సీఎం కేసీఆర్ దీక్ష దివాసన స్ఫూర్తిగా తీసుకోవాలని, దీక్ష దివాస్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మళ్లీ దశ ఉద్యమాన్ని మలుపుతికి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని ముద్ర వేసిన మహానాయకుడు కేసిఆర్ అన్నారు. స్వరాష్ట్రకల శాఖరానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29 అన్నారు.
నవంబర్ 29 తేదీన నిర్వహించే బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమానికి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్ష దివాసును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు గుర్తుచేయాలని, దీక్ష దివాస్ స్ఫూర్తితో ప్రజలను మేల్కొల్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ సింగిల్ వెండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎడ్ల సత్తిరెడ్డి,  నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, అతికేం లక్ష్మీనారాయణ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి లు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.