
– పార్టీ శ్రేణులకు నామా పృథ్వీ తేజ సూచన..
– ఎన్నికల ప్రచారంపై ముఖ్య నేతలతో సమీక్ష..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయం లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని పని చేయాలని ఆయన తనయుడు నామా పృథ్వీ తేజ్ సూచించారు. పార్లమెంట్ లో ‘తెలంగాణ గొంతుక నామ’ మాత్రమేనని, ఖమ్మం అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే సత్తా ఆయనకే ఉందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై సమీక్షించారు.అపార రాజకీయ అనుభవం ఉన్న ‘నామ’తోనే అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు. అమలు కానీ హామీల తో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. కెసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే లబ్దిదారులకు అందుతున్నాయని, కాంగ్రెస్ హామీలు ఏక నోచుకోక పోవటం లేదని సమావేశం వివరించారు. ‘నామ’ను గెలిపించి కేసీఆర్కు కానుకగా అందించాలని, అందుకు ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి నామా విజయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “నామా’ గెలుపు కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు కు చెంపపెట్టు కావాలని చెప్పారు.అప్పుడే రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ధి వస్తుందని, కాంగ్రెస్ సాధ్యం కాని హామీలతో ప్రజలు మోస పోయారని, కాంగ్రెస్ గెలుపు లో ప్రజలు తప్పులేదని, కేవలం ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు వాగ్దానాల కే కారణమని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల జీవితాలకు పూర్తి భరోసానిస్తుందని అబద్దాలతో కాలం వెళ్ళదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, రావు జోగేశ్వరరావు, వగ్గెల పూజ, భూక్యా ప్రసాదరావు చిన్నం శెట్టి వెంకట నరసింహం, యూఎస్ ప్రకాశరావు, కాసాని చంద్రమోహన్ తాడేపల్లి కవి, మందపాటి మోహన్ రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, జె. శ్రీరామూర్తి రఘురామ్, లీలా ప్రసాద్ చందా వెంకట నర్సయ్య, చిప్పనపల్లి శ్రీను, తాళం సూరి తదితరులు పాల్గొన్నారు.