టెలి సినిమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి

– ఎర్రబెల్లి శరత్ చంద్ర ప్రసాద్
నవతెలంగాణ-ధర్మసాగర్ :
టెలి సినిమాలు సమాజానికి ఉపయోగపడే వింగా ఉండాలని మాజీ సర్పంచి ఎర్రబెల్లి శరత్చంద్ర ప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం సినీ నటుడు నిర్మాత సామ్రాట్ విక్రం, సినీ దర్శకుడు ఎమ్మెస్ వాసు సారధ్యంలో నిర్మిస్తున్న టెలి సినిమా పరివర్తన వాల్ పోస్టర్ ను వారు  ఆవిష్కరించి మాట్లాడారు. నేటి సమాజంలో సమాజానికి మానసిక ఉల్లాసంతో పాటు ఉత్సాహాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా టెలి సినిమాలు నిర్మించాలని సూచించారు. అనంతరం సిని నర్మాత  ఎన్ ఎస్ కే ప్రొడక్షన్ అధినేత  నటుడు  సామ్రాట్ సామ్రాట్ విక్రం మాట్లాడుతూ ధర్మసాగర్ పరిసర ప్రాంతాల,ఎత్తయిన ఇనుప రాత్రి గుట్టలు,రిజర్వాయర్ ప్రాంతం, మిషన్ భగీరథ కేంద్రంలో షూటింగ్ అతి త్వరలో ప్రారంభం చేస్తామన్నారు. ఒక మంచి కథతో సమాజానికి ఒక మంచి సందేశం తో ఈ టెలి ఫిల్మ్ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన సన్నివేశాలు మండల కేంద్రంలో చిత్రీకరిస్తున్నామని  తెలిపార  ఈ కార్యక్రమం లో  సింగర్ తిలక్, రాయుళ్ల సాంబరాజు, నాగవెల్లి దుర్గరాజు,గుండె జగదీష్ బాబు,ఎండి ముజీద్ తదితరులు పాల్గొన్నారు.