నా కథలో కల్పితాలు వద్దని చెప్పా

Tell me there is no fiction in my storyభాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌ ఆయనే. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్‌ పెట్టారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. శ్రీదేవి మూవీ పిక్చర్స్‌ అధినేత శివలెంక కష్ణప్రసాద్‌ సమర్పణలో అక్టోబర్‌ 6న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతోహొముత్తయ్య మురళీధరన్‌ ముచ్చటించారు. ఆ విశేషాలు…హొనా జీవితాన్ని సినిమా తీయాలని ఎప్పుడూహొఅనుకోలేదు. కొన్ని కారణాల వల్ల దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమా చేయలేదు. శ్రీపతితోహొస్క్రిప్ట్‌ ఫినిష్‌ చేయమని చెప్పా. తర్వాత విజరు సేతుపతి హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సినిమా చేయాలని ప్లానింగ్‌ జరిగింది. అప్పుడుహొఏమైందో అందరికీ తెలుసు. నాతో పాటు చాలా రోజులు ట్రావెల్‌ చేసిన, నా గురించి బాగా తెలిసిన, స్క్రిప్ట్‌ రాసిన శ్రీపతిని డైరెక్ట్‌ చేయమని చెప్పా. తర్వాత విజరు సేతుపతి ప్లేస్‌లో మధుర్‌ మిట్టల్‌ వచ్చారు. సినిమా పూర్తైన తర్వాత శ్రీదేవి మూవీస్‌ శివలెంక కష్ణప్రసాద్‌ ముందుకు వచ్చారు. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో… ఈ సినిమాను అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించడం వెనుక అదే విధంగా ఎత్తుపల్లాలు ఉన్నాయి. సినిమాలో నిజంగా జరిగిన కథ మాత్రమే ఉండాలని దర్శకుడికి షరతు విధించా. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్‌ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. మంచి, చెడుతో పాటు చాలా విషయాలు జరిగాయి. ఇందులో నో ఫిక్షన్‌! ఈ సినిమాలో క్రికెట్‌ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం అంతా నా లైఫ్‌ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, సింహళీహొభాషల్లో విడుదల అవుతోంది.