నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
ఎంపీగా పనిచేసిన అరవింద్ గారు ఎక్కడ మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేశా రో చెప్పండి అని జిల్లా కిసాన్ జనరల్ సెక్రెటరీ వేల్పూర్ ఏలేటి రాజేందర్ అన్నారు.. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడుతూ మీరు ఎంపిగా ఉండి ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడ మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేశారు చెబితే మేము కాంగ్రెస్ నాయకులు అందరం సందర్శిస్తాం బాండ్ పేపర్ రాసి ఇచ్చి మరి రైతులకు మోసం చేసి అబద్దాలు మాట్లాడే ఘనత మీకే చెల్లింది ఒక వేల్పూరు ముద్దుబిడ్డగా సవాల్ చేస్తా న్నాను …మీరు మా వేల్పూర్ ముద్దుబిడ్డ కాంగ్రెస్ నాయకులు అయినా డి శ్రీనివాస్ కుమారుడిగా బిజెపిలో చేరి మీ స్వార్థ రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడుతూ మా వేల్పూర్ మండల పరువు తీస్తున్నారు .మీరు తెరిపిస్తామన్న ఫ్యాక్టరీలు ఎక్కడ తెర్పించారో ఎన్ని తెర్పించారో అలాగే పసుపు బోర్డు ఏర్పాటు పై మాతో చర్చకు ఎక్కడికి వస్తారో చెప్పగలరు మేము సిద్ధం మీరు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు మీ చదువు సంధ్యలు మీ రాజకీయం కాంగ్రెస్ పార్టీ బిక్ష మీ డీఎన్ఏ మొత్తం కాంగ్రెస్ పార్టీవే.కాంగ్రెస్ పార్టీలో మీరు ఎదిగిన తర్వాత బిజెపిలో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు అంటే తల్లి లాంటి పార్టీని మీ కన్న తండ్రిని అవమానించినట్లే కాదా గత ఎన్నికల్లో అనేక కారణాలవల్ల మీరు గెలిచినారు ఆ కారణాలు లేకపోతే మీకు డిపాజిట్ వచ్చేది కాదు గతంలో ఎన్నికల్లో కవితకు బుద్ధి చెప్పినట్లే ఈ ఎన్నికల్లో అరవింద్ మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు .తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతూ బాండ్ పేపర్ రాసి ఇచ్చి మరి రైతులను మోసం చేసిన మీకు ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన మీ ఓటమి తప్పదని సవాల్ చేస్తున్నాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నిజామాబాద్ ఎంపి గా జీవన్ రెడ్డి గెలవడం ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.