ఇప్పడమెందుకు? చూడాలనిపిస్తే చెప్పు!

– మంత్రి కేటీఆర్‌కు పొన్నం సెటైర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నడిరోడ్డుపై కాంగ్రెస్‌ నేతల బట్టలిప్పి నిలబెడతామంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్‌ ఇచ్చారు. ‘మా బట్టలు ఇప్పడమెందుకు? చూడాలని అనిపిస్తే చెప్పు నేను,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారయణ, ఆది శ్రీనివాస్‌, మేడిపల్లి సత్యం బట్టలు ఇప్పి చూపిస్తాం’ అని సెటైర్‌ వేశారు. కవితకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీ బీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడుగా బీసీని నియమించాలని సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు గెలిస్తే బీఆర్‌ఎస్‌ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ‘బీఆర్‌ఎస్‌ది స్వేద పత్రం కాదు…మీకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనే పత్రం బయట పెట్టాలి’. అని సవాల్‌ విసిరారు.