కట్టమైసమ్మ చెరువు రక్షణకు తీసుకున్న చర్యలేంటో చెప్పండి

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం కట్టమైసమ్మ చెరువు పరిరక్షణకు తీసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఏర్పాట్లపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలంది. కట్టమైసమ్మ చెరువు ఎఫ్టిఎల్‌, బఫర్‌ జోన్స్‌లో ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలంది. ఈ మేరకు హైకోర్టు సోమవారం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఏవమైనా సంస్థల సహకారం తీసుకుని వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం, చెరువు చుట్టూ రక్షణకు ఏర్పాట్లకు ప్రయత్నాలు చేయాలనీ, తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో స్థాయీ నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారం గ్రామంలోని కట్టమైసమ్మ రక్షణకు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎస్‌ మల్లేశ్వరరావు నాలుగేండ్ల క్రితం ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ ఆరాదే, జస్టిస్‌ జై అనిల్‌ కుమార్తెలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. చెరువు రక్షణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై జీహెచ్‌ఎంసీ నివేదిక సమర్పించింది. చెరువు ఎఫ్‌ .టి. ఎల్‌.ప్రాంతాన్ని గుర్తించామని, 1697 ఎకరాలు ఉందని, 212 ఎకరాలు బఫర్‌ జోన్‌ ఉందని తెలిపింది చెరువులో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని పేర్కొంది .చెరువు చుట్టూ లింక్‌ లింక్‌ చైన్‌ మెస్లో కంచె ఏర్పాటు చేసినట్టు తెలిపింది కార్పొరేట్‌ కంపెనీల బాధ్యత కింద్ర వాకింగ్‌ ట్రాక్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది వీటన్నింటినీ జీహెచ్‌ఎంసీ పం స్తోందని తెలిపింది. ఈ దికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం చెరువు రక్షణకు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషనర్ల విచారణను మూసిఎ సింది చెరువు అభివద్ధిపై తీసుకున్న చర్యలపై స్థాయీ నివేదికను మూడు నెలల్లో హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని ఆదేశించింది.