నవతెలంగాణ- అశ్వారావుపేట: ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడ రా నీ జాతి నిండు గౌరవమును అన్న నాటి మన జాతి నేతల మాటలను తూచా తప్పక పాటిస్తున్నారు మన నేటి అమెరికాలోని ప్రవాస తెలుగువారు. స్థానికంగా నాగరికులు ఐన ఎందరో తరతరాలుగా వస్తున్న ఎన్నో సంప్రదాయాలను, సంస్క్రుతి లను సైతం పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో స్థిరపడిన మన తెలుగు వారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాలకు చెందిన మన కుటుంబాలు అక్కడ దీపావళి భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. అమెరికా కాలిఫోర్నియా లో ఉంటున్న పలు కుటుంబాలు మన గణేష్ నవరాత్రులు, విజయదశమి, దీపావళి వంటి పర్వదినాలను ఇలా సమూహంగా నిర్వహించడంతో పాటు అమెరికన్లు ను ఆహ్వానించడం పరిపాటిగా మారిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా, కుక్కునూరు మండలం ఉప్పేరు కు చెందిన గంజి చక్రధర్ హర్షం వ్యక్తం చేసారు.