తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Telugu Desam Party Membership Registration Programనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి పట్టణ తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు పట్టణ పార్టీ అధ్యక్షులు బచ్చు శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో స్థానిక “బంజారాహిల్స్ ” లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ హడ్ హక్ కమిటీ కన్వీనర్ కుందారపు కృష్ణా చారి హాజరై,  సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ పరిదిలో భువనగిరి ని సభ్యత్వ నమోదు లో అగ్ర స్థానంలో నిలపాలని కోరారు.100 రూ.లు చెల్లించి సభ్యత్వం తీసుకున్నవారికి “5 లక్షల భీమా” సౌకర్యం ఉందనీ, ఇది ప్రతి ఒక్కరికీ తెలియచేసి సభ్యత్వం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూసరి చంద్ర శేఖర్ గౌడ్, నాయిని విద్యాసాగర్, మాటూరి శ్రీనివాస్,అరేపల్లి రాము, మాటూరి ఆంజనేయులు,సిరికొండ సైదులు, ఇటుకల స్వామి,మండల పార్టీ నాయకులు ఎర్రబోయిన రమేష్,కనకయ్య, శ్రీనివాస్ మేస్త్రి, కృష్ణ లు పాల్గొన్నారు.