నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల, తడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పద్యాలు, తెలుగులో మాట్లాడుకుందాం అనే వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ, తాడూరి గంగాధర్,ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి, జావీద్, ఉపాధ్యాయులు ప్రసాద్, పవన్, రాజ నర్సయ్య, రాజేంధర్, శ్రీనివాస్, సమత, ఇందిరా, కృష్ణప్రసాద్, ఆనంద్, దేవానంద్, విజయ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.