తెలుగు అనగానే అమ్మ గుర్తొస్తుంది!
అమ్మప్రేమ, లాలన గుర్తొస్తుంది
మొదటి చందమామ కథ గుర్తొస్తుంది
నాయనమ్మ కథనా పటిమ గుర్తొస్తుంది
చిన్నప్పటి స్నేహితులు
ఆటలు,పాటలు గుర్తొస్తాయి
చదివిన పుస్తకాలు,
ఉపన్యాసాలు గుర్తొస్తాయి
వ్యాసరచనలో బహుమతి గుర్తొస్తుంది
అవే చాటుతాయి తెలుగు గొప్పతనం
మాతృభాషంటే నాలుకపై నటన కాదు!
హృదయాంతరాల లోపలి అంతరంగం
కొరుకుడు పడక, మింగుడుపడక
ఒంటికి పడక ఒంటరైన అమ్మను
లాలించి బుజ్జగించి మన మనస్సుల్లోకి
నడిపించిన తొలిఅడుగు మన’గిడుగు’!
నేటి వ్యవహారిక వ్యవహారం ఉన్నపళంగా ఊడి పడిందేం కాదు
జాతికి పునర్జన్మనిచ్చిన గొంగళిపురుగు
నుండి సీతాకోకచిలుకలా
గ్రాంథికం నుండి వ్యవహారికం వరకు
చాలా వ్యవహారమే నడిచింది…
గిడుగు పిడుగు గర్జనకు తేట తెనుగు
హర్షించి వర్షించాకే…
నేడీ సప్తవర్ణ శోభిత ఆధునిక సాహితీ
ఇంద్రచాపానికి నాడు బీజం పడింది!!
(ఆగష్టు29న తెలుగుభాషా దినోత్సవం)
– భీమవరపు పురుషోత్తమ్
సెల్:9949800253