శబ్ద తరంగిణి ఆధ్వర్యంలో తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం


నవతెలంగాణ కంఠేశ్వర్: నిజామాబాద్ నగరంలోని సరస్వతీ నగర్ రోడ్ నెంబర్ 4 లో శబ్ద తరంగిణి సంస్థ కార్యాలయంలో గురువారం తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్యాంక్ మేనేజర్ సాయిప్రసాద్ హాజరై తెలుగు భాష అమ్మ భాష అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సర్ల ధ్యానం అధ్యక్షత వహించారు. తెలుగు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించాలన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని సూచించారు. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రకాష్ గౌడ్, దయానంద్, సాయిప్రసాద్, సందీప్ రెడ్డి, రాజ్ కుమార్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.