జైపూర్ : తెలుగు టాలన్స్ టాప్ లేపింది. ఢిల్లీ పాంజర్స్‌పై 26-23తో ఘన విజయం సాధించిన తెలుగు టాలన్స్.. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో ఆరు మ్యాచుల్లో నాల్గో విజయం నమోదు చేసిన టాలన్స్ సత్తా చాటింది. గోల్‌కీపర్ రాహుల్ మెరుపు ప్రదర్శనకు తోడు దేవిందర్ సింగ్ భుల్లార్, నసీబ్, రఘు, మోహిత్ కుమార్‌లు రాణించటంతో ఢిల్లీ పాంజర్స్‌పై తెలుగు టాలన్స్ ప్రతీకార విజయం సాధించింది.