స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేస్తున్న ఆలయ ఈఓ

Temple EO offering Swami's laddu prasadam– రాజన్నను దర్శించుకున్న  జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు..
– జాతోతు హుస్సేని..
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జాతీయా ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేని ఆలయ అర్చకులు స్వస్తి వేద మంత్రాలతో ఆహ్వానించారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణమండపం లో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి కమిషన్ సభ్యులకు శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట స్థానిక ఆర్డీఓ రాజేశ్వర్, తాసిల్దార్ మహేష్, టౌన్ సిఐ వీర ప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఈఓ సిసి ఎడ్ల శివ,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.