నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆయా ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. బంధుమిత్రులు సైతం గుడి ఆవరణంలో కలుసుకోగా ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అదేవిధంగా క్రైస్తవులు చర్చ్ లలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మొదటి ఆరాధనలో సోదరి సోదరమణులు పాల్గొని ప్రార్థనలు చేశారు.