కళాశాలల బంద్ తాత్కాలిక విరమణ

– రేపటి నుండి పునః ప్రారంభం 
– ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా కొనసాగుతున్న డిగ్రీ, పిజి కళాశాలల బందును తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరి బుర్ర వెంకటేశం ఇచ్చిన హామీ మేరకు బంద్ ను విరమించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరములో జారీ చేసిన టోకెన్ల మొత్తాన్ని వారం రోజులలో విడుదల చేస్తామని టిపిడిపీఎంఏ  సంఘం రాష్ట్ర నాయకతంతో జరిపిన చర్చలలో ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్ర వెంకటేశం హామి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర కమీటి ఆదేశాల మేరకు బంద్ ను తాత్కాలికంగా విరమించి, శుక్రవారం నుండి కళాశాలలను పునః ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్యంతో చర్చించడంలో సహకరించిన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అర్. కృష్ణయ్య, టిపిడిపిఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డా. బి. సూర్యనారాయణరెడ్డి, కారదర్శి వై. రామకృష్ణ, కళాశాలల యజమానులకు, అధ్యాపక మిత్రులకు, విదార్థి సంఘ నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిడియా మిత్రులకు ప్రత్యేక ధనవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు పాల్గొన్నారు.