రేపటి నుంచే పది పరీక్షలు…

– 20 పాఠశాలలు,3 కేంద్రాలు..
– హాజరుకానున్న 641 మంది విద్యార్థులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది పదో తరగతి వార్షిక(2024) పరీక్షలు మార్చి 18 నుండి మార్చి 30 వరకు జరుగనున్నాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో,అశ్వారావుపేట మండలంలోని ప్రభుత్వ,ప్రైవేట్ యాజమాన్యాల 20 ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం 641 మంది పదో తరగతి విద్యార్థులు అశ్వారావుపేట పట్టణం లోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత(9051),జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల(9052) లు,సున్నం బట్టి గిరిజన ఆశ్రమ పాఠశాల (9053)ల్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయ నున్నారు. ఇందులో తెలుగు మాధ్యమం లో 302 మంది,ఆంగ్ల మాధ్యమం 339 మంది విద్యార్ధులు పరీక్షలు రాయ నున్నారు.ఈ పరీక్షలు రాసే వారిలో బాలురు 290,బాలికలు 351 మంది ఉన్నారు.మొత్తంగా 641 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారు. జిల్లా పరిషత్ బాలురు,బాలికల,సున్నం బట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో   ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణకు చీప్ సూపరింటెండెంట్ లు,డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు గా పి.హరిత,పి.ప్రసాద్ రావు,షాహి నా బేగం,టి.శ్రీనివాస్,సి.హెచ్ వెంకయ్య,కేఆర్ సీ ప్రసాద్ లు తో 21 మంది పరీక్షల పర్యవేక్షకులు (ఇన్విజిలేటర్స్) నియమితులు అయినట్లు ఎం.ఈ.ఓ క్రిష్ణయ్య తెలిపారు.