కుక్కల దాడిలో పది గొర్రె, మేక పిల్లలు మృతి
నవతెలంగాణ-మల్హర్ రావు : మంథని పట్టణ సమీపంలోని బోయినిపేటలో ఆదివారం సాయంత్రం కుక్కల దాడిలో 10 గొర్రె, మేక పిల్లలు మృతి చెందాయి.గ్రామానికి చెందిన పర్షవేన రాజయ్య యాదవ్ గొర్రెలను మేత కోసం బయటికి తీసుకుపోగా, ఇంటివద్ద గొర్రె పిల్లలు, మేక పిల్లలను ఒక షెడ్డులో ఉంచగా, ఆ షెడ్డు లోపలికి వచ్చిన కుక్కలు ఒక్కసారిగా గొర్రె, మేక పిల్లలపై దాడి చేసి హతమార్చాయి. దీంతో రాజయ్య కు దాదాపు రూ. లక్ష వరకు నష్టం జరిగిందని, రాజయ్య బోరున్న విలపిస్తూ చెప్పారు. గ్రామంలో కుక్కలు సైరవిహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తనను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.